ETV Bharat / city

Payyavula fires on YSRCP: రాష్ట్రంలో ఆర్థిక అరాచకం.. బడ్జెట్‌ అంకెలతో ప్రజల్ని మాయ చేస్తున్నారు: పయ్యావుల కేశవ్ - బడ్జెట్‌ అంకెలతో ప్రజల్ని మాయ చేస్తున్నారన్న తెదేపా నేత పయ్యావుల కేశవ్

Payyavula fires on YSRCP: రాష్ట్రంలో ఆర్థిక అరాచకం నెలకొందని, బడ్జెట్‌ అంకెలతో మాయ చేస్తున్నారని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ధ్వజమెత్తారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, కేంద్రం జోక్యం చేసుకుని చక్కదిద్దకపోతే మరింత పతనం అవుతుందని హెచ్చరించారు. రికార్డుల్లో లేని 48వేల కోట్లు ఏమయ్యాయో ప్రభుత్వం సమాధానం చెప్పితీరాలని నిలదీశారు.

tdp leader Payyavula keshav fires on YSRCP over State Finance problems
బడ్జెట్‌ అంకెలతో ప్రజల్ని మాయ చేస్తున్నారు: పయ్యావుల కేశవ్
author img

By

Published : Mar 27, 2022, 11:25 AM IST

బడ్జెట్‌ అంకెలతో ప్రజల్ని మాయ చేస్తున్నారు: పయ్యావుల కేశవ్

Payyavula fires on YSRCP: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటే.. సీఎం డ్యాష్‌బోర్డులో వివరాలెందుకు అప్‌డేట్‌ చేయట్లేదని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. శాసనసభ ఆమోదం లేకుండా పైసా కూడా ఖర్చు చేసే అధికారం సీఎంకు లేదని స్పష్టం చేశారు. శాసనసభ ఆమోదించినట్లు ఖర్చు పెడుతున్నారా? లేదా? అనేది ప్రజా పద్దుల కమిటీ చూస్తుందన్న పయ్యావుల.. అసెంబ్లీ ఆమోదం లేకుండానే రూ.98వేల కోట్లు ఖర్చుపెట్టడం పెద్దనేరమని మండిపడ్డారు.

మూలధన వ్యయం చేయని రాష్ట్ర ప్రభుత్వం.. రుణ అర్హత కోసం లెక్కల్లో చూపిస్తోందని పయ్యావుల విమర్శించారు. వ్యవసాయం, జలవనరులు, రహదారుల ప్రాజెక్టులపై పెట్టుబడి పెడితే.. భవిష్యత్తులో ఆదాయం పెరుగుతుందన్నారు. జలవనరుల శాఖలో తెదేపా హయాంలో 68వేల కోట్లు ఖర్చుచేస్తే.. ఈ ప్రభుత్వ హయాంలో పోలవరం మినహాయిస్తే 6వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని ధ్వజమెత్తారు. విద్యుత్తు శాఖలో పంపిణీ సంస్థల బకాయిలే 12వేల కోట్లున్నాయని ఆక్షేపించారు. రోడ్లేయడమే నేరం అన్నట్లుగా జగన్‌ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

కాగ్‌ లేవనెత్తే అభ్యంతరాలు అసాధారణమైనవేనన్న పయ్యావుల... ఆర్థిక, ఇతర శాఖల అధికారులు బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఆర్థిక అవకతవకలు గురించి వివరించేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవనున్నట్లు పయ్యావుల వెల్లడించారు.

ఇదీ చదవండి: ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సీఆర్‌డీఏ నోటీసులు.. అమరావతి రైతుల అభ్యంతరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.