అమ్మఒడి పేరుతో ఇస్తున్నామని చెబుతున్న డబ్బులను... నాన్నకు మద్యం అమ్మకాలతో ప్రభుత్వమే తిరిగి కొల్లగొడుతోందని తెదేపా ఆరోపించింది. భారీగా పెరిగిన మద్యం ఆదాయమే ఇందుకు నిదర్శనమని ఆ పార్టీ నేత పట్టాభి అన్నారు. విద్యార్థులకు జగన్ మామను అని చెప్పుకుంటున్న సీఎం...ప్రైవేటు కళాశాలల్లో చదివేవారికి రీయింబర్స్మెంట్ దూరం చేసి కంసమామలా మారారని ఆరోపించారు. జగన్ నిర్వాకంతో 40 ఇంజినీరింగ్ కళాశాలలు మూతపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వచ్చే ఏడాది నుంచి అమ్మఒడికి బదులు ల్యాప్ టాప్లు ఇస్తామని ప్రకటించిన స్కీమ్..స్కామ్ కోసమేనని ఆరోపించారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా తెదేపా హయంలోని గత ప్రభుత్వం ఇప్పటికే అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం తీసుకొస్తే.. జగన్ 5,900 కోట్లు ఇంటర్నెట్ కోసం ఖర్చు పెడతామనటం నిధుల స్వాహాకి మార్గాలు వెతుకలాటలో భాగమేనని విమర్శించారు. తెదేపా ప్రభుత్వ హయంలో మంజూరైన 3 లక్షల 81 వేల సైకిళ్లు తుప్పుపడుతున్నా..వాటిని పేద బాలికలకు ఇచ్చేందుకు మనసురాలేదా అని ప్రశ్నించారు.
ఇదీచదవండి: సీఎం జగన్ పిల్లలు మాత్రమే విదేశీ విద్యకు అర్హులా ?: లోకేశ్