ముఖ్యమంత్రి జగన్ అసమర్థత వల్ల వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో రాష్ట్రం మెరుగైన అవకాశాలు కోల్పోతోందని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. వ్యాక్సిన్ పంపిణీలో సమర్థవంతంగా పనిచేయటంతో పాటు తక్కువ వృథా చేసే రాష్ట్రాలకు ప్రాధాన్యం ఉంటుందని కేంద్రం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో వెల్లడించిదని గుర్తు చేశారు. ఈ రెండు అంశాల్లో వైకాపా ప్రభుత్వ అసమర్థత విధానాల వల్ల ఏపీ ఎంతో వెనుకబడి ఉందన్నారు.
ముఖ్యమంత్రి చేతకానితనం వల్ల ప్రజలు నష్టపోతుండటంతో పాటు ఆరోగ్యానికి భద్రత లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కొవిడ్ నియంత్రణలో ఇప్పటికే పూర్తిగా విఫలమవటంతో పాటు భవిష్యత్తులో కేంద్రం నుంచి ఎక్కువ డోసుల వ్యాక్సిన్ పొందే అవకాశం కోల్పోయారని దుయ్యబట్టారు.
ఇదీచదవండి
CM Jagan Letter to PM Modi: 'పీఎంఏవై కింద రాష్ట్రాలకు నిధులివ్వండి'