ETV Bharat / city

'టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఎమ్మెల్యే కారుమూరిని అరెస్టు చేయాలి' - tanuku latest news

Pattabhi on TDR Bands Scam: తణుకులో టీడీఆర్ ​బాండ్ల కుంభకోణంలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుతోపాటు ఆయన బినామీలను అరెస్టు చేయాలని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి డిమాండ్‌ చేశారు. తణుకులో ముగ్గురు మున్సిపల్​ అధికారులను సస్పెండ్‌ చేయడంతో అక్రమాలను ప్రభుత్వం అంగీకరించిందని పట్టాభి పేర్కొన్నారు.

pattabhi on TDR Bands Scam
TDR Bands Scam
author img

By

Published : Mar 17, 2022, 3:52 PM IST

టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై తెదేపా నేత పట్టాభి మీడియా సమావేశం

TDR Bands Scam in Tanuku: తణుకు మున్సిపాలిటీ కేంద్రంగా జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో వైకాపా ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావే ప్రధాన ముద్దాయని తేలిపోయిందని తెదేపా జాతీయ అధికారప్రతినిధి పట్టాభి అన్నారు. తణుకులో ముగ్గురు మున్సిపల్​ అధికారులను ప్రభుత్వం సస్పెండ్‌ చేయడమే అందుకు నిదర్శనమన్నారు. ఈ కుంభకోణంలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుతోపాటు ఆయన బినామీలను అరెస్టు చేయాలని పట్టాభి డిమాండ్‌ చేశారు.

నిన్నటివరకు ఎలాంటి అవినీతి జరగలేదని కారుమూరి బుకాయిస్తే.. నేడు తణుకు మున్సిపల్ అధికారులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుందని పట్టాభి ప్రశ్నించారు. టీడీఆర్ బాండ్ల్ అవినీతిలో అసలు ముద్దాయిలు ఎమ్మెల్యే కారుమూరి, ఆయన అనుచరులు, బినామీలైతే.. కేవలం అధికారులపై చర్యలు తీసుకొని అసలైన నిందితులని తప్పించాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. జగన్​ సర్కార్​ తక్షణమే టీడీఆర్ బాండ్ల అవినీతి వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని పట్టాభి డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: PRC: ఉద్యోగ సంఘాల నేతలతో మరోసారి భేటీకానున్న మంత్రుల కమిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.