తెదేపా అధికారంలో ఉన్నప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చిన ఫోర్త్ లయన్ యాప్‌ను క్లోనింగ్ చేసి దిశ యాప్‌గా తీసుకువచ్చారని.. తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు.
"తమది కానీ ఘనతను తమదిగా చెప్పుకుంటూ.. జగన్ రెడ్డి మరోసారి దొరికిపోయారు. గతంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చి.. కాపీ కొట్టిన రీతిలోనే దిశ యాప్ పేరిట ప్రజల ముందు ఓ డ్రామా ఆడే ప్రయత్నం చేశారు. మహిళలు, వారి భద్రతపై లేని చిత్తశుద్ధి నిరూపించుకునేందుకు దిశ యాప్ తానే తెచ్చినట్లుగా నాటకాలాడారు. దిశ యాప్‌లో ఉన్న ఎస్ఓఎస్ బటన్ ఫీచర్ తో పాటు ట్రాక్ మై ట్రావెల్, అత్యవసర, సమీప పోలీస్ స్టేషన్లు, ఉన్నతాధికారుల ఫోన్ నెంబర్ వివరాలన్నీ ఫోర్త్ లయన్ యాప్‌ను మక్కీకి మక్కీ కాపీ కొట్టినవే. జగన్ రెడ్డి ప్రభుత్వంలో.. సీఎం సొంత చెల్లితో పాటు ముఖ్యమంత్రి నివాసం చుట్టూ ఉండే మహిళలకు భద్రత లేదు. మహిళల భద్రతకు చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన ఐ క్లిక్ ఫిర్యాదు వెసులుబాటు, సిటిజన్ యాప్, అభయ యంత్రాలను నిరుపయోగం చేశారు." అని మండిపడ్డారు.
ఇదీ చదవండి:
Jagan Cabinet Decisions: విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు.. ఇళ్ల నిర్మాణాలకు భారీగా నిధులు!