ETV Bharat / city

Lokesh Letter to CM : రైల్వేస్థలాల్లో ఉన్న పేద‌ల‌కు పక్కా గృహాలు నిర్మించి ఇచ్చేదెప్పుడు..? -లోకేశ్ - Lokesh Letter to CM on pucca houses for poor people

Lokesh Letter to CM : గుంటూరు జిల్లా తాడేప‌ల్లి రైల్వే స్థలాల్లోని నివాసితులకి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వేరే చోట ఇళ్లు క‌ట్టి త‌ర‌లించే వ‌ర‌కూ.. రైల్వే అధికారులు వారి ఇళ్లు కూల్చకుండా స‌మయం ఇచ్చేలా సీఎం త‌క్షణ‌మే చ‌ర్యలు తీసుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ కి ఆయన విడివిడిగా లేఖలు రాశారు.

Lokesh Letter to CM
రైల్వేస్థలాల్లో ఉన్న పేద‌ల‌కు పక్కా గృహాలు నిర్మించి ఇచ్చేదెప్పుడు..? -లోకేశ్
author img

By

Published : Jan 21, 2022, 4:51 PM IST

Lokesh Letter to CM : గుంటూరు జిల్లా తాడేప‌ల్లి రైల్వే స్థలాల్లోని నివాసితులకి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వేరే చోట ఇళ్లు క‌ట్టి త‌ర‌లించే వ‌ర‌కూ..రైల్వే అధికారులు వారి ఇళ్లు కూల్చకుండా స‌మయం ఇచ్చేలా సీఎం త‌క్షణ‌మే చ‌ర్యలు తీసుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్​కి ఆయన విడివిడిగా లేఖలు రాశారు. తాడేప‌ల్లిలోని 6, 14, 15, 16వార్డుల ప‌రిధి రైల్వే స్థలాల్లో న‌ల‌భై ఏళ్లుగా ఇళ్లు క‌ట్టుకుని పేద‌ల‌ు నివ‌సిస్తున్నారన్నారు. వారికి ఒక్కరోజులో ఇళ్లు ఖాళీ చేయాల‌ని రైల్వే అధికారులు తాఖీదులు ఇచ్చారని తెలిపారు. దీనిపై అత్యవ‌స‌రంగా జగన్‌ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. రైల్వేస్థలంలో ఉన్న పేద‌ల‌కు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చారని గుర్తుచేశారు. వారందరికీ వేరే చోట ఇళ్లు క‌ట్టి త‌ర‌లించేవ‌ర‌కూ ఇక్కడే నివాసం ఉండేలా రైల్వే అధికారుల‌ని ఒప్పించాలని కోరారు. దాదాపు 650 పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలు దాదాపుగా 40 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారని వివరించారు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి వారిదని విజయవాడ రైల్వే డివిజనల్‌ మేనేజర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఉన్నపళంగా జనవరి 22 లోపు ఇళ్లు ఖాళీ చేయాలని రైల్వే అధికారులు నోటీసులు ఇవ్వడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందని ఆవేదన చెందారు. కొవిడ్ కారణంగా పనులు లేక పూట గడవటమే ఇబ్బందిగా మారిన వారికి.. రైల్వే నోటీసులతో నిలువ నీడ కూడా లేకుండా పోతోంద‌ని ఆందోళన చెందుతున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించి పక్కా ఇళ్లు నిర్మించే వరకూ తాడేపల్లి రైల్వే స్థలంలో నివాసితుల‌కు మానవతా దృక్పథంతో అక్కడే వుండే అవకాశం ఇవ్వాలని కోరారు.

ఇదీ చదవండి : Attack on VRO : వీఆర్వోపై దాడి...పోలీసులకు ఫిర్యాదు...

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.