ETV Bharat / city

NAKKA: 'దిగజారుడు రాజకీయాలొద్దు.. ఆత్మాభిమానం ముఖ్యం' - విజయవాడ వార్తలు

తెదేపా అధినేత చంద్రబాబుపై ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని తెదేపా నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఇటువంటి రాజకీయాలను సీఎం ప్రోత్సహించడాన్ని తప్పుపడుతూ నక్కా ఆగ్రహం వ్యక్తం చేశారు.

nakka anand babu fire
nakka anand babu fire
author img

By

Published : Aug 25, 2021, 7:44 PM IST

ఎస్సీలను అడ్డం పెట్టుకుని వారితో పనికి మాలిన కామెంట్లు చేయిస్తూ సీఎం జగన్‌ నీచమైన రాజకీయానికి దిగారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు దుయ్యబట్టారు. ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి దిగజారుడు రాజకీయాలొద్దని నక్కా హెచ్చరించారు. "తెదేపాకు రెండు సీట్లు వస్తే చంద్రబాబు ఇంట్లో పాకీ పని చేస్తారు" అంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆత్మాభిమానం కోసం పదవులను త్యాగం చేసిన ఘనత ఎస్సీలదని నక్కా అన్నారు. పదవులు శాశ్వతం కాదని.. ఆత్మాభిమానంతో ఉండాలని నారాయణ స్వామికి హితవుపలికారు. నారాయణ స్వామితో ఈ తరహా వ్యాఖ్యలు చేయాలని సీఎం జగన్​ ఒత్తిడి తెచ్చి ఉంటారని నక్కా ఆనంద్ బాబు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:

CM JAGAN: 'కొవిడ్ మార్గదర్శకాలు పాటించకపోతే కఠిన చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.