సంగం డెయిరీ ఆక్రమణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. అమూల్‌కు మేలు చేసేందుకే న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగా డెయిరీని ఆక్రమించే ప్రయత్నాలు ముమ్మరం చేశారని ధ్వజమెత్తారు.
సంగం డెయిరీ ఆస్తులను దొడ్డిదారిన అమూల్‌కు అప్పగించే ప్రయత్నమిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడి రైతులకు మేలు చేసే సంగం డెయిరీతో సీఎం జగన్‌కు వచ్చిన నష్టమేంటని ఆనంద్‌బాబు నిలదీశారు. రైతులకు మేలు చేసే సంస్థలను ప్రోత్సహించాల్సిందిపోయి.. లక్షలాది మంది రైతులకు ఉపయోగపడుతున్న డెయిరీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
లీటర్ పాలకు నాలుగు రూపాయలు బోనస్ ఇస్తానన్న వాగ్ధానం సీఎం విస్మరించినా.. సంగం డెయిరీ మాత్రం ధర పెంచి రైతులకు లబ్ధి చేకూర్చుతోందన్నారు.
ఇవీ చదవండి: సంగం డెయిరీ యాజమాన్యం బదిలీ.. ప్రభుత్వ ఉత్తర్వులు