పౌరసరఫరాల శాఖ మంత్రి కనుసన్నల్లోనే రూ.4వేల కోట్ల బియ్యం కుంభకోణం జరుగుతోందని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఆరోపించారు. వైకాపా మాఫియా కన్ను ఇప్పుడు పేదల బియ్యంపై పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేని బియ్యాన్ని కొనుగోలు చేసి, రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందిస్తున్నారని ఆక్షేపించారు. విషయం బయటకు పొక్కడంతో ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని తెస్తున్నారని అన్నారు. రూ.4వేల కోట్ల అవినీతిలో జగన్‌రెడ్డి వాటా ఎంత అని నిలదీశారు. మిల్లర్ల ముసుగులో వైకాపా నేతలు చేస్తున్న దందాను ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు.
ఇదీచదవండి: STEEL PLANT : స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మానవహారం