Lokesh fired on Jagan: ఆడబిడ్డలు బలైపోతుంటే సీఎం జగన్ రెడ్డి మహిళల్ని అవహేళన చేసే విధంగా మాట్లాడటం విచారకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ మండిపడ్డారు. ఇలాంటి ఘటన ముఖ్యమంత్రి ఇంట్లో జరిగితే.. ఇంతే వెటకారంగా మాట్లాడతారా అని నిలదీశారు. హోంమంత్రి మహిళ అయి ఉండి పెంపకంలో తేడా వలనే అత్యాచారాలు జరుగుతున్నాయని మహిళల్ని అవమానపరుస్తున్నారని దుయ్యబట్టారు.
ఒక యువతిని ప్రభుత్వ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారం చేస్తే.. ప్రతిపక్షాలు యాగీ చేస్తున్నాయని ముఖ్యమంత్రి అనడం సబబేనా? అని ప్రశ్నించారు. అంబులెన్స్ మాఫియా వేధింపులు తట్టుకోలేక ఒక తండ్రి బిడ్డ మృత దేహాన్ని బైక్ పై తీసుకెళ్తే తెదేపా యాగీ చేస్తుందనడం సరైనదేనా? అని జగన్ రెడ్డి తన మనసాక్షిని ప్రశ్నించుకోవాలని లోకేశ్ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి : నేరస్తులకు ప్రభుత్వం ఫ్రెండ్లీగా నడుస్తోంది: వర్ల రామయ్య