Lokesh On YSRCP Activists Attack: గుంటూరు జిల్లా కొప్పర్రు గ్రామానికి చెందిన తెలుగుదేశం దళిత కార్యకర్త వెంకటనారాయణపై వైకాపా కార్యకర్తలు చేసిన దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. జగన్ జన్మదిన వేడుకల్లో చంద్రబాబును దూషిస్తోన్న వైకాపా కార్యకర్తల్ని ప్రశ్నించడంతో మద్యం సీసాలతో విచక్షణరహితంగా నారాయణను కొట్టారంటూ మండిపడ్డారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించిన రాక్షస చర్యను తప్పు పట్టారు. తప్పు చేస్తుంటే వద్దని వారిస్తే చంపేస్తారా ? అని లోకేశ్ ధ్వజమెత్తారు. వైకాపా అరాచకాలకు రోజుకొకరు బలవ్వాల్సిందేనా అని ప్రశ్నించారు.
ఏం జరిగిందంటే..
గుంటూరు జిల్లా పెద్దనందిపాడు మండలం కొప్పర్రు గ్రామానికి చెందిన నారాయణ.. చంద్రబాబుపై వ్యాఖ్యలు చేస్తున్న వైకాపా కార్యకర్తలను నిలదీశాడు. దాంతో నారాయణ, వైకాపా కార్యకర్తల మధ్య సోమవారం అర్థరాత్రి వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వైకాపా వర్గీయులు నారాయణపై దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి: YCP Activists Attack: తెదేపా మద్దతుదారుడిపై వైకాపా కార్యకర్తల దాడి