అంతర్వేది ఘటన జరిగి 4 రోజులైనా నిందితులను పట్టుకోక పోవడం.. స్పందించినట్టా లేక ముఖ్యమంత్రి కనీసం దీనిపై నోరు మెదపకపోవటం స్పందించినట్టా.. అని తెదేపా నేత జవహర్ నిలదీశారు. అంతర్వేది ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఆందోళన చెందుతుంటే వారి మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా..? అని ప్రశ్నించారు. కులాల మధ్య కుంపట్లు, మతాల మధ్య గొడవలు పెట్టి పబ్బం గడుపుకొనే సంస్కృతి వైకాపాదేనని జవహర్ మండిపడ్డారు. గతంలో జగన్‌ను, విజయమ్మను, వైఎస్‌ను నోటికొచ్చినట్లుగా తిట్టిన బొత్స... ఇప్పుడు వారి పంచన చేరి లోకేశ్‌ను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సీఎం నిర్ణయం