సీఎం జగన్ అధికారం.. రాష్ట్రానికి మిగిల్చింది అంధకారమేనని.. తెదేపా నేత జీ.వీ.ఆంజనేయులు దుయ్యబట్టారు. ప్రభుత్వ ముందుచూపంతా అవినీతి, దోపిడీపైనే ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు.. ఏసీల్లో జీవిస్తుంటే, సామాన్యులకు ఫ్యాన్ గాలికూడా లేదని మండిపడ్డారు. సాయంత్రం 6 దాటాక ఫ్యాన్లు, ఏసీలు ఆపేయాలని ప్రజలకు సలహాలిస్తున్న ప్రభుత్వ పెద్దలు.. ఆ పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఫ్యాను గుర్తుకు ఓటేసినందుకు, ప్రజల ఇళ్లల్లో ఎక్కడా ఫ్యాన్ తిరగడంలేదని ఆయన ఆక్షేపించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలోని డిస్కంల బకాయిలను కూడా.. జగన్ రెడ్డి ఇప్పుడు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ లకు 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని చెప్పి, అకారణంగా కాలనీల్లో కరెంట్ తీసివేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇవ్వకుంటే.. వారే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.
ఇదీ చదవండి:
TDP Conference: సీమకు నీటి కోసం అవసరమైతే దిల్లీకి వెళ్లి పోరాటం: బాలకృష్ణ