రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి విన్నారా అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు. నేను ఉన్నాను.. నేను విన్నాను అని చెప్పిన జగన్ కేంద్రం చెప్పింది విన్నారా, చూశారా? అని ప్రశ్నించారు. జగన్ కేంద్రం మెడలు వంచారో, భయపడ్డారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'వైకాపాది కేంద్రం నుంచి కప్పు కాఫీ కూడా తెచ్చుకోలేని దుస్థితి'