చెత్త సేకరణ వాహనాల(Dola Bala Veeranjaneya Swamy comments on garbage vehicles) ప్రారంభోత్సవానికి గొప్పగా ప్రకటనలు ఇచ్చి ప్రజా ధనాన్ని దుబారా చేశారని తెదేపా శాసనసభ పక్ష విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. కమీషన్ల కోసమే వాహనాలను కొనుగోలు చేశారని ఆరోపించారు. తెదేపా హయాంలోని వాహనాలకు రంగులు వేసి వైకాపా ఆర్భాటాలు చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. న్యాయస్థానాలు తప్పుపట్టినా ప్రభుత్వానికి బుద్ధిరావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు హయాంలో.. పారిశుద్ధ్య పనుల కోసం గ్రామ పంచాయతీలకు ఈ- ఆటోలు, ట్రాక్టర్లను పంపిణీ చేశారని గుర్తు చేశారు.
జగన్ ప్రభుత్వం.. బియ్యం వాహనాల పేరుతో రూ.592 కోట్ల ప్రజాధనాన్ని వృథా(wast of money on garbage vehicles) చేసిందని.. ఇప్పుడు 10 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించి కమీషన్ల కోసం వాహనాలు కొనుగోలు చేశారని ధ్వజమెత్తారు. చెత్త ఎత్తే వాహనాల విషయంలోనూ కక్ష రాజకీయాలా అని బాలవీరాంజనేయ స్వామి నిలదీశారు.
ఇదీ చదవండి..: పవన్ చెప్పినట్లు అన్ని పార్టీలు ప్రభుత్వంపై పోరాడాలి: విష్ణుకుమార్ రాజు