రేణిగుంట విమానాశ్రయంలో తెదేపా అధినేత చంద్రబాబును నిర్బంధించిన జగన్.. ఆంధ్రా ఔరంగజేబుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి దుయ్యబట్టారు. చంద్రబాబు సమర్ధత, సత్తా ఉన్న నాయకుడు కాబట్టే ప్రజల కోసం.. జగన్ చేసే అవమానాలను భరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను జలగకన్నా దారుణంగా జగన్ దోచుకుంటున్న తీరుపై మహిళలు ఆలోచించాలని కోరారు.
"జగన్ మద్యపాన నిషేధం చేస్తారు, గన్ కంటే ముందు వస్తారు" అని ప్రగల్భాలు పలికిన వైకాపా మహిళా నేతల నోళ్లు ఇప్పుడేమయ్యాయని ప్రశ్నించారు. అన్నా క్యాంటీన్లు మూసివేయటంతో పాటు, విదేశీ విద్యాసాయం నిలిపివేత, ఇసుక, సిమెంట్ ధరలు పెంపు వంటి ఎన్నో ఘనకార్యాలు సాధించిన వైకాపాకు పురపాలక ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయాలా అంటూ నిలదీశారు.
ఇదీ చదవండి: అరాచక పాలనకు చరమగీతం పాడాలి: గల్లా జయదేవ్