ETV Bharat / city

'కలియుగ గాంధీ'కి రైతు సమస్యలు వినబడడంలేదా: దివ్యవాణి - సీఎం జగన్​పై దివ్యవాణి విమర్శల వార్తలు

కలియుగ గాంధీ అంటూ సొంత మీడియా చేత చెప్పించుకుంటున్న సీఎం జగన్​కు.. రైతు సమస్యలు వినబడడంలేదా అని తెదేపా అధికార ప్రతినిథి దివ్యవాణి విమర్శించారు. సమస్యలు చెప్పుకునేవారు లేక ప్రజలు తలలు పట్టుకుంటున్నారని ఆమె అన్నారు.

divyavani
దివ్యవాణి, తెదేపా నేత
author img

By

Published : Oct 5, 2020, 5:36 PM IST

రైతులను ఉద్దేశించి మంత్రులు చేసిన వ్యాఖ్యలు నీచంగా ఉన్నాయని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు. సీఎం జగన్​ను కలియగ గాంధీ అని సొంత మీడియా పోల్చటం విడ్డూరమని ఎద్దేవా చేశారు. రైతు సమస్యలను కలియుగ గాంధీ చెవులుండీ వినటం లేదా అని ఆమె ప్రశ్నించారు. ఎరక్కపోయి ఓట్లు వేసి ఇరుక్కుపోయామని ప్రజలు బాధపడతున్నారని చెప్పారు.

అసత్యాల ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. సమస్యలు చెప్పుకునే వారు లేక ప్రజలు తలలు పట్టుకుంటున్నారని దివ్యవాణి వ్యాఖ్యానించారు. శిరోముండనం కేసుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరుస ఘటనలు జరగుతున్నాయని మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. చట్టాలు కఠినంగా అమలు చేయకపోవటం వల్లే ఇలాంటివి పునరావృతమవుతున్నాయని విమర్శించారు.

ఇవీ చదవండి:

జనసంద్రంగా ద్రోణంరాజు శ్రీనివాస్ అంతిమయాత్ర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.