ETV Bharat / city

Dhulipalla: "జగన్‌ వైఫల్యం వల్లే రాష్ట్రం.. అంధకార ఆంధ్రప్రదేశ్‌గా మారింది" - ఏపీ తాజా రాజకీయ వార్తలు

Dhulipalla Narendra: జగన్‌ విధానాల వల్లే రాష్ట్రం సతమతమవుతోందని.. జగన్‌ వైఫల్యం వల్లే అంధకార ఆంధ్రప్రదేశ్‌గా మారిందని తెదేపా సీనియర్​ నేత ధూళిపాళ్ల విమర్శించారు. రాష్ట్రంలోని పరిశ్రమలకు పవర్‌ హాలిడే విధిస్తున్నారని.. ఉల్లంఘించిన వారికి లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నారని మండిపడ్డారు.

Dhulipalla Narendra
ధూళిపాళ్ల
author img

By

Published : May 4, 2022, 6:40 PM IST

Dhulipalla Narendra: ఏపీలో విద్యుత్‌ కోతలు, రోడ్లు సరిగా లేవని కేటీఆర్‌ చెప్పారని తెదేపా సీనియర్​ నేత ధూళిపాళ్ల అన్నారు. ఏపీకి బస్సు తీసుకుని వెళ్లి రోడ్ల దుస్థితిని చూపెడతామని చెప్పారు. పరిశ్రమలు 50 శాతమే విద్యుత్‌ వినియోగించుకోవాలని... ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి ఆర్డర్‌లో స్పష్టంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని పరిశ్రమలకు పవర్‌ హాలిడే విధిస్తున్నారని... ఉల్లంఘించిన వారికి లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నారని మండిపడ్డారు. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ దొరకట్లేదని చెబుతున్నారన్నారు. యూనిట్‌కు రూ.20 పెట్టి కొందామన్న విద్యుత్‌ దొరకట్లేదని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రావట్లేదని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపానికి బాధ్యులు సీఎం జగన్‌ కాదా అని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల రాష్ట్రం విద్యుత్‌ కోతలమయమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక బొగ్గు ఒప్పందాలు చేసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రహస్య ఒప్పందాలు చేసుకుని... అధిక ధరకు విద్యుత్‌ కొని పేదలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. జగన్‌ విధానాల వల్లే రాష్ట్రం సతమతమవుతోందని... జగన్‌ వైఫల్యం వల్ల అంధకార ఆంధ్రప్రదేశ్‌గా మారిందని విమర్శించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.