ధాన్యం అమ్ముకున్న రైతు మళ్లీ పొలంలోకి వెళ్లి వ్యవసాయం చేసే పరిస్థితి లేదని తెదేపా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(DEVINENI UMA) ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా జి.కొండూరులో రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేప్టటారు. రైతులు పండించిన పంటను అమ్ముకుంటే వైకాపా ప్రభుత్వం వారికి డబ్బులు చెల్లించకుండా(PADDY DUES).. ఆ డబ్బులతో ఆటలాడుతోందని మండిపడ్డారు.
చంద్రబాబు తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయించారని గుర్తు చేశారు. గతంలో రైతులకు విత్తనాలు, పెట్టుబడి రుణాలు, పట్టాలు ఇచ్చేవారమని అన్నారు. రూ.41 వేల కోట్లు ఏమయ్యాయో.. దానిపై ముఖ్యమంత్రి జగన్ (CM JAGAN) ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. సీఎం తాడేపల్లి రాజాప్రసాదంలో పబ్జీ(PUBG) ఆడుకుంటున్నాడని ధ్వజమెత్తారు. సీబీఐ కేసుల్లో, ఈడీ కేసుల్లో నుంచి కాపాడుకోవడానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని దేవినేని ఉమ మండిపడ్డారు.
ఇదీ చదవండి:
Vinayaka chaturthi 2021: సెప్టెంబర్ 10 నుంచి గణేశ్ ఉత్సవాలు