రాష్ట్రంలో విద్యార్థులందరినీ సీఎం జగన్ తన పిల్లలుగా భావిస్తే.. కరోనా తీవ్రత వాస్తవాలు అర్థమయ్యేవని తెదేపా అధికార ప్రతినిధి బత్యాల చెంగల్రాయుడు విమర్శించారు. పరీక్షలు ముఖ్యమా, విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా అంటే పరీక్షలే ముఖ్యమని ముఖ్యమంత్రి అంటున్నారని మీడియా సమావేశంలో ఆరోపించారు. మీ బిడ్డలు పరీక్షలు రాస్తుంటే ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటారా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: ఉచితం అంటే అర్థం ఇదే: రాహుల్
ప్రాణం ముఖ్యమో, చదువు ముఖ్యమో తల్లిదండ్రులకే తెలుసని తెదేపా నేత చెంగల్రాయుడు అన్నారు. సీఎం జగన్ తుగ్లక్ వారసుడని భవిష్యత్ తరం చెప్పుకోకుండా విజ్ఞతతో వ్యవహరించాలని హితవు పలికారు. వ్యాక్సిన్ కోసం మినహా తాడేపల్లి ప్యాలెస్ వదిలి ఒక్కసారీ బయటకు రాలేదని ఆరోపించారు. సీఎం సొంత జిల్లాలో ఆక్సిజన్ అందక అనేకమంది మరణిస్తుంటే.. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని విమర్శించారు. కరోనా పొంచి ఉందనే ఒత్తిడి.. పరీక్షలు రాసే విద్యార్థులను ఇంకా కృంగదీస్తుందన్నారు. న్యాయస్థానం నిర్ణయం తీసుకోకమందే మానవత్వంతో వ్యవహరించి పరీక్షలు వాయిదా వేయాలని డమాండ్ చేశారు.
ఇదీ చదవండి: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కరోనా సోకదా..?: నారా లోకేశ్