సీఎం జగన్పై తెదేపా నేత బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. ఐఏఎస్ అనే పదాన్ని 'అయ్యా ఎస్' అనే విధంగా మార్చేశారని ధ్వజమెత్తారు. అధికారులతో ఆ విధంగా పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. సివిల్ సర్వీసులను తన సొంతానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి సలహాదారులు అపరిమితమైన అధికారాలతో రాజ్యాంగేతర అధికారులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకు మరో సీఎంగా మారారని వ్యాఖ్యానించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం, నిమ్మగడ్డ రమేశ్ కుమార్, పీవీ. రమేశ్, జాస్తి కృష్ణకిశోర్ వంటి సీనియర్ అధికారులు ఊహించని వేధింపులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
'ప్రజలను మంచిదారిలో పెట్టే వ్యవస్థ ఐఏఎస్.. అలాంటి అధికారుల్ని ముఖ్యమంత్రి జగన్ సొంత పనులకు వినియోగించుకుంటున్నారు. తన మాట వినే వాళ్లనే పక్కన పెట్టుకుని.. రాజ్యాంగబద్ధంగా పని చేసే వారిని సాగనంపుతున్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. సివిల్ సర్వీసులను ఇలా వాడుకోవడం ఎంతవరకు సమంజసమని మేం సీఎంను ప్రశ్నిస్తున్నాం' - బుద్దా వెంకన్న, తెదేపా నేత
ఇవీ చదవండి...
విమర్శలు భరించలేక.. కాపు ఉద్యమం నుంచి వైదొలుగుతున్నా: ముద్రగడ