పిట్ట కథలు చెప్పే ఆర్థిక మంత్రి బుగ్గన కేంద్రం నుంచి వచ్చిన నిధులపై లెక్కలు చెప్పాలని తెదేపా అధికార ప్రతినిధి బోండా ఉమా డిమాండ్ చేశారు. ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలం అవ్వడం వల్లనే దక్షిణాదిలో ఏపీ టాప్లో ఉందని మండిపడ్డారు. పాలన చేతకాకపోతే చంద్రబాబు దగ్గర శిక్షణ తీసుకోవాలని హితవుపలికారు.
చంద్రబాబుకు పగ్గాలు ఇస్తే కరోనా కట్టడి చేసి చూపిస్తారని బోండా ఉమా సవాల్ విసిరారు. చంద్రబాబు ఖాళీగా కూర్చోకుండా...నిత్యం అధ్యయనం చేసి అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చెప్తున్న నిర్ధరణ పరీక్షలు సంఖ్య పూర్తిగా అసత్యమని ఆరోపించారు. అన్నింటికి రివర్స్ టెండర్లు అన్న ప్రభుత్వం కిట్ల కొనుగోలుకు అసలు టెండర్లే పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిట్ల కొనుగోలు విషయంలో మరిన్ని అక్రమాలు బయట పడతాయని బోండా అన్నారు.
ఇదీ చదవండి : ఫేస్ షీల్డ్.. కరోనా నుంచి మరింత రక్షణ ఇక మన సొంతం!