ETV Bharat / city

ముఖ్యమంత్రయ్యాక.. జగన్ ఒక్క పరిశ్రమనైనా తీసుకొచ్చారా?: బండారు

సులభతర వాణిజ్యంలో ఏపీకి తొలి ర్యాంకు రావడంపై వైకాపా నేతల ప్రకటనలు సిగ్గుచేటని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. 2019 మార్చి 20కి ముందు నాటి సులభతర వాణిజ్య విధానాలకు అవార్డ్ వచ్చిందని కేంద్రం చాలా స్పష్టంగా చెప్పినా, మంత్రులు బొత్స, బుగ్గన, గౌతమ్ రెడ్డి అలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.

tdp leader bandaru on ease of doing business

author img

By

Published : Sep 6, 2020, 9:26 PM IST

సులభతర వాణిజ్య విధానాలు, సంస్కరణలు అంటే ఏమిటో ఈ ప్రభుత్వానికి తెలుసా అని మాజీ మంత్రి బండారు నిలదీశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన కృషిని.. ఇప్పుడు తమదిగా చెప్పుకుంటున్న జగన్, ముందు తన ఆర్థికనేరాల సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు.

జగన్ క్విడ్ ప్రో కో ఫలితంగా ఇప్పటికీ ఐఏఎస్ లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. జగన్ ముఖ్యమంత్రయ్యాక ఒక్క పరిశ్రమైనా రాష్ట్రానికి వచ్చిందా? అని ప్రశ్నించారు. కొడాలినాని లాంటి వారు మంత్రులైతే, ఏపీకి తొలిస్థానం వస్తుందా? అని బండారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

'సూర్య సినిమాలు ఆపేసి.. రాజకీయాల్లోకి రావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.