ETV Bharat / city

నన్ను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది..?: ఏవీ సుబ్బారెడ్డి

తనను హత్య చేసేందుకు మాజీమంత్రి అఖిలప్రియ దంపతులే సుపారీ ఇచ్చారని పోలీసులు చెప్పిన మాటలు విని ఆందోళనకు గురయ్యానని తెదేపా నేత... ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. తనకు అఖిలప్రియ రాజకీయం నేర్పుతుందా..? అని ఆయన ప్రశ్నించారు.

తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డి ప్రెస్​మీట్
తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డి ప్రెస్​మీట్
author img

By

Published : Jun 6, 2020, 1:27 PM IST

మాట్లాడుతున్న ఏవీ సుబ్బారెడ్డి

తనను హత్య చేయించేందుకు మాజీమంత్రి భూమా అఖిలప్రియ దంపతులే సుపారీ ఇచ్చారని పోలీసులు చెప్పిన విషయాలు విని షాక్‌ అయ్యానని తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో తన కుమార్తె జస్వంతితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తనపై దాడి జరిగిన తర్వాత రెండున్నర నెలలు మౌనంగా ఉన్నట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

తనకు అఖిలప్రియ రాజకీయం నేర్పుతుందా..? అఖిలప్రియ ముద్దాయి అవునా..? కాదా..? అన్నదే ప్రశ్న అన్నారు. ఆమెపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. తన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ఆళ్లగడ్డ రమ్మంటుందన్నారు. తనను చంపాల్సిన అవసరం ఏమొచ్చిందో వారే చెప్పాలని సుబ్బారెడ్డి ప్రశ్నించారు.

అఖిలప్రియ మంత్రిగా ఉన్నా... ఆళ్లగడ్డలో ప్రజల సమస్యలను తానే పరిష్కరించానని తెలిపారు. తన తండ్రి నాగిరెడ్డి నామినేషన్‌కు వెళ్తున్న సమయంలో ప్రత్యర్థులు దాడులు చేస్తుంటే తన భుజాలపై ఎత్తుకెళ్లి కాపాడినట్లు చెప్పారు. చింతకుంట రాంరెడ్డి, మాదం శ్రీనులు వారి మనుషులు అవునా..? కాదా చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మా నాన్న ప్రాణం ఖరీదు రూ.50 లక్షలా?

ఆడపిల్లగా నాన్నలేని పరిస్థితిని ఊహించుకుంటేనే భయంగా ఉందని ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జస్వంతి అన్నారు. మా నాన్నను దేవుడిచ్చిన మామగా చెప్పుకునే అఖిలప్రియ ఆయన్ను చంపేందుకు కుట్ర చేసిందని మండిపడ్డారు. అఖిలప్రియ తీరు మహిళలకే సిగ్గుచేటన్నారు. మా నాన్న ప్రాణం ఖరీదు రూ.50 లక్షలా అని ఆమె ప్రశ్నించారు.

ఇగీ చూడండి: 'దయచేసి ఆమెకు పార్టీ టికెట్టు ఇవ్వొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.