ఎంఎస్ఎంఈ(MSME)లకు ప్రోత్సాహకాల పేరుతో.. మరోమారు సీఎం జగన్(CM Jagan) దగా చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) దుయ్యబట్టారు. ఇచ్చిన పారిశ్రామిక రాయితీల కన్నా.. విద్యుత్ ఛార్జీల బాదుడే ఎక్కువగా ఉందని విమర్శించారు. ఎంఎస్ఎంఈలకు(MSME) రూ.1600కోట్ల బకాయిలు ఉంటే.. ఇచ్చింది రూ.440 కోట్లేనన్నారు. టెక్స్టైల్, స్పిన్నింగ్ మిల్లులకు(textile, spinning mills) రూ.2వేల కోట్ల బకాయిలకు గాను రూ.684కోట్లు ఇచ్చారన్నారు. రకరకాల కారణాలతో.. లబ్ధిదారుల సంఖ్యను నాలుగో వంతు కోత కోశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
పొరుగు రాష్ట్రాలకు పరిశ్రమలు..
జగన్రెడ్డి ప్రభుత్వ నిర్వాకంతో.. పారిశ్రామికాభివృద్ధి రేటు మైనస్ 3.26కు పడిపోయిందన్నారు. ప్రభుత్వ నిధులను.. వైకాపా నేతలు లూఠీ చేయడం వల్లే అరకొరగా రాయితీల విడుదలవుతున్నాయని ఆరోపించారు. జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాకంతో గత రెండేళ్లలో.. రూ.10లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు పారిపోయాయని విమర్శించారు. గత ప్రభుత్వ బకాయిలు విడుదల చేశాయని చెప్పడం తగదన్న ఆయన.. అధికారంలో ఎవరున్నా బకాయిలు చెల్లించడమనేది నిరంతర ప్రక్రియ అని గుర్తుచేశారు.
రూ.5వేల కోట్ల ప్రోత్సాహకాల ప్రస్థావనే లేదు
రాష్ట్రంలో భారీ పరిశ్రమలకు ఇవ్వాల్సిన.. రూ.5వేల కోట్ల ప్రోత్సాహకాల ప్రస్థావనే లేదన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు ఇవ్వాల్సిన రూ.500 కోట్ల మాటేమిటని ప్రశ్నల వర్షం కురిపించారు. బడ్జెట్లో రూ.200కోట్లు కేటాయించి.. రూ.13,500 కోట్లతో కడప స్టీల్ ప్లాంట్ ఎప్పటికి నిర్మిస్తారని అచ్చెన్నాయుడు నిలదీశారు.
ఇదీ చదవండి:
MSME Funds: రూ.1,124 కోట్లతో ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు విడుదల