కడప జిల్లా ప్రొద్దుటూరులో వైకాపా నాయకులు చేసే అక్రమాలు, అవినీతిని ప్రశ్నించినందుకే నందం సుబ్బయ్యను దారుణంగా హత్య చేశారని తెదేపా ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ఇళ్ల పట్టాల పేరుతో వైకాపా నేతలు రూ. వేల కోట్లు కుంభకోణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. చేనేత వర్గాలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ధర్మవరం, మంగళగిరి నుంచి ఈ దుస్థితి ప్రొద్దుటూరు వరకు పాకిందన్నారు. చేనేత కార్మికుల ఉసురు సీఎం జగన్కు తప్పక తగులుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: