ETV Bharat / city

'మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలపై చర్యలు తీసుకోండి' - మహిళల భద్రతపై ఎన్​హెచ్​ఆర్సీకి ఫిర్యాదు చేసిన వంగలపూడి అనిత

Anitha Complaint to NHRC: వైకాపా సర్కార్​ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. అఘాయిత్యాలపై చర్యలు తీసుకోవాలని ఎన్​హెచ్​ఆర్సీ, జాతీయ మహిళా కమిషన్​కు ఆమె లేఖ రాశారు.

Anitha Complaint to NHRC on Women Safety
వంగలపూడి అనిత
author img

By

Published : Mar 12, 2022, 8:44 AM IST

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. ఈమేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌, జాతీయ మహిళా కమిషన్​కు ఆమె లేఖ రాశారు. ఈనెల10న కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కారాగ్రహం ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. దీనిపై బాధితురాలు దిశా పోలీస్‌ స్టేషన్​ను ఆశ్రయించినా ఎలాంటి చర్యలు లేవని.. ఎట్టకేలకు మచిలీపట్నం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నెల్లూరులో జరిగిన ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం అన్నారు.

గత రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో మహిళలపై దాడులు గణనీయంగా పెరిగాయని అనిత విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై కఠినంగా వ్యవహరించకపోగా.. మరింతగా ప్రోత్సహిస్తున్నట్లు ఉన్నందునే ఈ తరహా దాడులు పెరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ ఘటనలన్నింటినీ పరిగణలోకి తీసుకొని సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. మహిళల భద్రతకు తగు చర్యలు చేపట్టాలని వంగలపూడి అనిత విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

మచిలీపట్నంలో దారుణం.. ప్రియుడిని చెట్టుకు కట్టేసి యువతిపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.