ధరలు పెంచాం కాబట్టి మద్యం సేవించే వారి సంఖ్య తగ్గుతుందని సీఎం జగన్ చెప్పడం... ఆయన అవగాహన లేమికి, అజ్ఞానానికి నిదర్శనమని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. మద్యపాన నిషేధం అనే కొంగ జపం చేస్తూ... జగన్ మహిళలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
మద్యం మానిపించడానికి ఒక్క డీఎడిక్షన్ సెంటర్, కౌన్సిలింగ్ సెంటర్, టీం, యంత్రాంగం ఏమైనా పెట్టారా అని ప్రశ్నించారు. మద్యం మహామ్మారి వల‌్ల ఆరెంజ్ జోన్లో ఉన్న వైజాగ్ రెడ్ జోన్లోకి వెళ్లిందని ఆరోపించారు. 36 కంపెనీల ద్వారా 1300 మద్యం బ్రాండులను తీసుకువచ్చారన్నారు.
ఇవీ చదవండి:
'మద్యం దుకాణాలు తగ్గిస్తే.. తాగుబోతుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది?'