తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ఏర్పాటు చేస్తున్న దివిస్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ స్థానికుల ఆందోళనలపై తెదేపా నిజనిర్ధరణ కమిటీని నియమించింది. దివిస్ కార్యాలయంపై దాడి, సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసుల అరెస్టులు తదితర అంశాలకు సంబంధించి కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని స్థానికులు ఆరోపిస్తున్న నేపథ్యంలో తెదేపా యనమల రామకృష్ణుడు నేతృత్వంలో 8మంది సభ్యులతో ఈ కమిటీని నియమించింది.
కమిటీ సభ్యులు నిజనిర్ధరణ చేసి ప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తారని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఓ ప్రకటనలో తెలిపారు. కమిటీ సభ్యులుగా బండారు సత్యనారాయణమూర్తి, జ్యోతుల నవీన్, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ, పిల్లి అనంతలక్ష్మీ, వనమూడి కొండబాబు, వరుపుల రాజాలను నియమించారు.
ఇదీచదవండి