రాష్ట్ర ప్రభుత్వం రాజధాని విషయంలో రైతులకు అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి పుల్లారావు, మాజీ శాసనసభ్యుడు తెనాలి శ్రావాణ్ కుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో రైతులు భూములను కేవలం రాజధాని కోసమే ఇచ్చారని ఇతర ప్రాంతాల వారికి ప్రభుత్వం ఏ విధంగా కేటాయిస్తుందని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్మోహన్ రెడ్డి హైకోర్టు ఉత్తర్వులను భేఖాతరు చేసి రాజధానిలో లేఅవుట్లు వేసే ప్రయత్నం చేయటం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనాను ఎలా అరికట్టాలని ప్రయత్నిస్తుంటే ఆయన మాత్రం ఇంట్లో కూర్చొని పేదల భూములను ఎలా లాక్కోవాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జగన్ ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకొని రాజధాని రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు
ఇదీ చూడండి తమిళనాడులో చిక్కుకున్న తెలుగువారిని స్వస్థలాలకు పంపండి'