మహానేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావుకు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ఇవ్వాలంటూ మహానాడు వేదికగా తేదేపా ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఎన్టీఆర్కు భారతరత్న కోసం పార్టీ కృషి చేస్తోందని అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన వ్యక్తి కాదు వ్యవస్థ అని కొనియాడిన చంద్రబాబు... ఎన్టీఆర్ జీవితం ఆదర్శనీయమని అన్నారు. సేవకు నిలువెత్తు రూపంగా నిలిచారని కీర్తించారు.
సవాళ్లు కొత్త కాదు.. ఎవరికీ భయపడేది లేదు
రెండోరోజు మహానాడు వేదికగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఎవరికీ భయపడదని తేల్చిచెప్పారు. పార్టీకి సవాళ్లు కొత్త కాదని... ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నామని స్పష్టం చేశారు. తెదేపాను ఎవరూ కదిలించలేరన్న ఆయన... ఎన్ని ఇబ్బందులు వచ్చినా కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడుతున్నారంటూ ప్రశంసించారు.
హత్యా రాజకీయాలు తమకు అలవాటు లేవన్న చంద్రబాబు.. కార్యకర్తలే పార్టీ శక్తి అని పునరుద్ఘాటించారు. మహానేతను స్ఫూర్తిగా తీసుకుని అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
ఇవీ చదవండి: