ETV Bharat / city

గ్యాస్ లీకేజీకి కారణాలు బయటపెట్టాలి: తెదేపా - విశాఖ గ్యాస్ లీకేజీపై తెదేపా ప్రశ్నలు

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ గ్యాస్ లీకవడానికి గల కారణాలు బయటపెట్టాలని తెదేపా నేతలన్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలని దేవినేని ఉమ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి డిమాండ్ చేశారు.

tdp demands reasons in vizag gas leak incident
దేవినేని ఉమ
author img

By

Published : May 10, 2020, 1:14 PM IST

tdp demands reasons in vizag gas leak incident
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై దేవినేని ఉమ ట్వీట్

ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 12 మంది చనిపోయి వేలాదిమంది నిరాశ్రయులైతే.. పర్యావరణ ఉల్లంఘన, విధ్వంసం, రాజ్యాంగ ఉల్లంఘన, వాటర్, ఎయిర్ యాక్ట్ సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోలేరా అని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పే మంచి పేరున్న ఎల్జీ కంపెనీలో అలారం ఎందుకు మోగలేదో.. సీసీ కెమెరాల ఫూటేజ్ ఎందుకు బయటపెట్టడం లేదో చెప్పాలని నిలదీశారు. సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అసలు కారణాలేంటి?

బాధితులకు పరిహారం చెల్లింపు, పరిశ్రమ ప్రతినిథులతో మధ్యవర్తిత్వంలో ఉన్న వేగం.. విషపూరితమైన స్టైరిన్ గ్యాస్ లీకవ్వడానికి గల కారణాలు, దానికి కారకులు ఎవరు అనే విషయాలు తెలుసుకోవడంలో ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపడం లేదని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం అడుగుతున్న బాధితులపై వేగంగా చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. లీకేజీకి గల అసలు కారణాలు ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఇవీ చదవండి:

మరో 50 మందికి పాజిటివ్: రాష్ట్రంలో కరోనా కేసులు 1980

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.