విజయవాడలో కార్పోరేషన్ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రధాన పార్టీల నేతలు వారి అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నారు. కార్పోరేషన్ ఎన్నికల ప్రచారం తెదేపా అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ఎంపీ కేశినేని నాని వారి అభ్యర్థులకు మద్దతుగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ విజయవాడ పశ్చిమనియోజకవర్గం 39వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు.
ఎంపీ సమక్షంలోనే వివాదం...
పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ సమయంలో... కార్పోరేటర్ అభ్యర్థి శివశర్మ వర్గం, గతంలో తెదేపాకు చెందిన మాజీకార్పొరేటర్ హరిబాబు వర్గం... ఎంపీ కేశినేని నాని సమక్షంలోనే బాహాబాహీకి దిగారు. గతంలో కార్పొరేటర్‌గా పనిచేసిన తనను కాదని వేరే వారికి అవకాశం ఎలా ఇస్తారని హరిబాబు వర్గం ఎంపీ కేశినేని నానితో వాగ్వాదానికి దిగింది. ఇరువర్గాలను పిలిచి ఎంపీ కేశినేని సముదాయించారు. గ్రూపులుగా విడిపోయి తగువులు పెట్టుకుంటే.. పార్టీకి నష్టం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు.
బుద్దా వెంకన్న దూరం...
పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని నాని ప్రచారంలో స్థానిక ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మైనార్టీ నాయకుడు నాగుల్ మీరా పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎంపీతో వాగ్వాదానికి దిగిన మాజీ కార్పొరేటర్ వర్గీయులు.. తామంతా బుద్దా వెంకన్న వర్గానికి చెందిన వారమని చెప్పుకోవడం గమనార్హం. తెలుగుదేశం పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని.. తెదేపా నాయకులు గన్నె ప్రసాద్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: