దేవినేని ఉమకు హాని తలపెట్టేందుకే రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌ను బదిలీ చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. జైలు సూపరింటెండెంట్ బదిలీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కొండపల్లిలో అక్రమ తవ్వకాలు ప్రశ్నించినందుకే ఉమపై దాడి చేశారన్నారు. రాజకీయ కక్షతోనే ఉమపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారన్నారు. దేవినేని ఉమకు ఎలాంటి హాని జరిగినా ప్రభుత్వామే పూర్తి బాధ్యత వహించాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి
CM jagan: 'పురపాలిక, నగరపాలికల్లో రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలి'