ETV Bharat / city

కస్టమ్స్ కళ్లుగప్పినా... టాస్క్​ఫోర్స్ చేతచిక్కి - విజయవాడలో దుబాయి బంగారం

కస్టమ్స్​నే మాయ చేశాడో ఓ వ్యక్తి.. వాళ్లకే తెలియకుండా 1.6 కిలోల బరువున్న బంగారాన్ని ..వారికి తనిఖీలలలో దొరకకుండా బయటికి వచ్చాడు. కానీ బయటున్న టాస్క్​ఫోర్స్ పోలీసుల సోదాలలో దొరికిపోయాడు. అసలూ కస్టమ్స్​కు దొరకుండా ఎలా వచ్చాడో అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

task force police take over gold at  Vijayawada
విజయవాడలో బంగారం పట్టివేత
author img

By

Published : Feb 18, 2021, 10:14 AM IST

దుబాయి నుంచి బంగారం బిస్కెట్లు తెచ్చారు. కస్టమ్స్ అధికారుల కంటబడకుండా వాటిని నల్ల కాగితంలో చుట్టి ఫోన్స్ బాక్స్ లాంటి పౌచ్​లో ఉంచారు. ఎలాగో కస్టమ్స్ అడ్డంకి దాటేశారు. కానీ కృష్ణా జిల్లా విజయవాడ విమానాశ్రయం బయట టాస్క్​ఫోర్స్ పోలీసులకు దొరికేశారు. ఈ ఘటన విజయవాడ విమానాశ్రయం సమీపంలో బుధవారం జరిగింది.

కడపకు చెందిన షేక్ మహమ్మద్ నవీద్ బాషా అనే వ్యక్తి 1.6 కిలోల బరువున్న బంగారాన్ని దుబాయి నుంచి తీసుకొచ్చాడు. కస్టమ్స్ కళ్లుగప్పి బయటకు వచ్చి కడపకు చెందిన మరో ఇద్దరితో కలిసి కారులో విమానాశ్రంయం బయలుదేరారు. కానీ, బయటే టాస్క్​ఫోర్స్​కు దొరికేశారు. విజయవాడలో ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవరుగా పనిచేసే నవీద్ బాషా ఫిబ్రవరి 6 న దుబాయి వెళ్లాడు. అక్కడ నుంచి బంగారం బిస్కెట్లు తీసుకుని 16న రాత్రి విజయవాడ విమానాశ్రయంలో దిగాడు. బయటకు వచ్చిన అతడని తీసుకెళ్లేందుకు షేక్​ ఇబ్రహీం, మహ్మద్ గౌస్ కారులో వచ్చారు. వీరు ముగ్గురూ కలిసి వెళ్తుండగా...ముందుగా అందిన సమాచారంతో టాస్క్​ఫోర్స్ పోలీసులు గేటు వద్ద ఆపి తనిఖీ చేయగా బంగారం గుట్టు రట్టయింది.

ఏమిటా నల్లకాగితం..?

విమానాశ్రయంలో కస్టమ్స్​కు దొరకుండా బంగారం బయటకు ఎలా తెచ్చారన్నదే ప్రశ్నగానే మిగిలింది. నల్లకాగితంలో చుట్టడంవల్లే దొరికి ఉండకపోవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కాగితంపై విచారణ చేస్తున్నారు. నిందితులను విచారించగా కడపకు చెందిన షేక్ మహమ్మద్ ఆలీ అనే వ్యక్తి సూచన మేరకు విజయవాడకు కారులో వచ్చామని మహమ్మద్ గౌస్, షేక్ ఇబ్రహీం చెబుతున్నారు. అతను ఎవరనే దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. బంగారం విషయం కూపీ లాగేందుకు నిందితులను విచారణ నిమిత్తం గన్నవరం పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి. బాలింతరాలు అయినా.. బాధ్యత మరువలేదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.