Raids On Medical Shops at Vijayawada: విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు ఔషధ దుకాణాల్లో చెన్నై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నక్కల రోడ్డులోని సత్యడ్రగ్ హౌస్, పుష్ప హోటల్ సెంటర్లోని వెంకటాద్రి ఫార్మాల్లో సోదాలు జరిపారు.
నొప్పి నివారణకు వినియోగించే టైడాల్ మందులను హోల్ సేల్‌గా బిల్లులు లేకుండానే చెన్నైకి సరఫరా చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో రంగంలోకి దిగిన తమిళనాడు పోలీసులు.. నగరంలోని పలు దుకాణాల్లో సోదాలు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు.
ఎన్ని రోజులుగా సరఫరా జరుగుతుంది..? ఎవరికి చేరుతుంది..? అనే విషయాలపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఈ తనిఖీల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే.. ఈ ఔషధాన్ని వైద్యుల సూచనల మేరకే వాడాలని.. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే విక్రయించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. టైడాల్ ఔషధం మత్తును కలిగిస్తుందని చెప్పారు.
ఇదీ చదవండి:
CM Jagan Meet PM Modi: ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రానికి ఊరట: ప్రధానికి సీఎం జగన్ వినతి