పోటీ చేసే అభ్యర్థులు.. ఒకే గుర్తు కావాలని కోరిన సందర్భాలు చాలానే ఉంటాయి. ఉదాహరణకు నలుగురు కోరితే.. ముందు నామినేషన్ ఎవరు వేస్తారో.. వారికే కేటాయిస్తారు. ఎప్పుడైనా గమినించారో.. లేదో.. నామినేషన్ స్వీకరించే సమయంలో అధికారులు నిమిషాలతో సహా సమయాన్ని పొందుపరుస్తారు. అంతే కాదు.. బ్యాలెట్ పత్రంలో అభ్యర్థి పేరు ఇంటి పేరుతో సహానా? లేదా పేరు మాత్రమే ముద్రించాలా? అన్న విషయాన్ని సదరు అభ్యర్థి ముందే అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం.. సర్పంచ్, వార్డు సభ్యుని పదవులకు విడివిడిగా కేటాయించాల్సిన గుర్తుల జాబితాను నిర్దేశిస్తూ.. నోటిఫికేషన్ జారీ చేస్తుంది. కమిషన్ విడుదల చేసిన గుర్తుల జాబితా నుంచే వరుసగా పోటీచేసే అభ్యర్థులకు వాటిని రిటర్నింగ్ అధికారి కేటాయిస్తారు.
సర్పంచ్ ఎన్నికల విషయంలో.. గుర్తుల జాబితాలోని మెుదటి గుర్తును అభ్యర్థుల జాబితాలో మెుదటి అభ్యర్థికి కేటాయిస్తారు. రెండో గుర్తును రెండో అభ్యర్థికి కేటాయిస్తారు. ఇదే విధంగా అన్ని కేటాయింపులు జరుగుతాయి. వార్డు సభ్యుడి ఎన్నిక విషయంలో కూడా ఇదే విధమైన పద్ధతిని పాటిస్తారు.
ఇదీ చదవండి: నిమ్మాడలో అచ్చెన్నాయుడు అరెస్టు.. రెండు వారాల రిమాండ్