కరోనా నివారణలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయంలో వైఎస్‌ఆర్ టెలీ మెడిసిన్‌ను ప్రారంభించారు. కరోనా కేసుల గుర్తింపు, ఐసొలేషన్, పరీక్షలు, క్వారంటైన్‌కు పంపడమే లక్ష్యంగా టెలీ మెడిసిన్‌కు శ్రీకారం చుట్టారు. ఓపీ సేవలు, ఔషధాల కోసం టెలిఫోన్ ద్వారా వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండగా...286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్స్ స్వచ్ఛందంగా సేవ చేసేందుకు ముందుకొచ్చారు. టెలీ మెడిసిన్‌కు ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబరు 14410 కేటాయించింది.
పటిష్టంగా అమలు చేయండి..
టెలీ మెడిసిన్ టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి వైద్యుడితో మాట్లాడిన సీఎం జగన్...ఈ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నిత్యం పర్యవేక్షించాలని, అవసరమైతే వైద్యుల సంఖ్య పెంచాలన్నారు.
ఇదీచదవండి