రాష్ట్రంలో జరిగిన లైంగిక వేధింపులకు(sexual harrasment) సంబంధించిన వేర్వేరు ఘటనలపై.. మహిళా కమిషన్(state women commission) స్పందించింది. గుంటూరు జిల్లా వరుస ఘటనలపై.. పోలీసు అధికారులతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ(state women commission chair person vasireddy padma) చర్చించారు. జిల్లాలోని మాచవరం మండలం పిల్లుట్లలో.. ఓ వివాహితపై వాలంటీర్ అత్యాచారయత్నం చేయడంపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై వాసిరెడ్డి పద్మ పోలీసుల నుంచి కేసు పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. వాలంటీర్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
గుంటూరు రాజీవ్‌గాంధీ నగర్లో.. మానసిక వికలాంగురాలిపై జరిగిన అత్యాచార ఘటన గురించి మహిళా కమిషన్ ఆరా తీసింది. సత్తెనపల్లి ఉర్దూ పాఠశాల టీచర్, చిత్తూరు జిల్లా పీలేరు మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వేధింపుల ఘటనలో.. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఏలూరు సబ్ రిజిస్టార్ లైంగిక వేధింపులపై.. మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: CM Jagan Review: ఉద్యోగ కల్పన దిశగా విద్యాప్రమాణాలు మెరుగుపరచాలి: సీఎం జగన్