అగ్రిగోల్డ్‌లో రూ. 20 వేల వరకు డిపాజిట్ చేసిన బాధితులకు ఈ నెల 24న రాష్ట్ర ప్రభుత్వం డబ్బు చెల్లించనున్నట్లు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకూ 7.76 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. వీరందరికీ ప్రభుత్వం సొమ్మును అందిస్తుందని వెల్లడించారు.
రూ. 10 వేల వరకు డిపాజిట్ చేసిన 3.40 లక్షల మంది బాధితులకు రూ. 240 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెల్లించిందని అన్నారు. అగ్రిగోల్డ్ సమస్య సత్వర పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం న్యాయపరంగా చేపట్టాల్సిన ప్రక్రియను ప్రభుత్వం చేపడుతోందని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులెవరూ ఆందోళనకు గురి కావల్సిన అవసరం లేదని.. ధైర్యంగా ఉండాలన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. ఎవరికైనా డబ్బు రాని పక్షంలో టోల్ ఫ్రీ నెంబరును సంప్రదిస్తే సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:
సచివాలయ సిబ్బంది సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాం: వెంకట్రామిరెడ్డి