ETV Bharat / city

'శుభవార్త...అటవీశాఖలోని ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్'

నిరోద్యుగులకు మరో తీపి వార్తను ప్రభుత్వం త్వరలో వినిపించనుంది. అటవీ శాఖలో 2వేల 552 క్షేత్ర స్థాయి పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు రాష్ట్ర అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి ఎన్‌.ప్రతీప్‌కుమార్‌ తెలిపారు.

'శుభవార్త...అటవీ శాఖలోని ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్'
author img

By

Published : Oct 1, 2019, 11:52 PM IST

'శుభవార్త...అటవీ శాఖలోని ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్'
అటవీశాఖలోని 2వేల 552 క్షేత్ర స్థాయి ఖాళీ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి జగన్‌ మోహనరెడ్డి సుముఖత వ్యక్తం చేశారని రాష్ట్ర అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి ఎన్‌.ప్రతీప్‌కుమార్‌ తెలిపారు. జనవరిలో నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ కానుందని పేర్కొన్నారు. శాఖలో కీలకమైన విధుల నిర్వహణకు సంబంధించిన వాటిలో 56 శాతం పోస్టులు ఖాళీగా ఉన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అటవీశాఖలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగ విరమణ రోజునే ‘పింఛను చెల్లింపు ఆర్డరు’ (పీపీవో) చేతికందించేలా చూడాలనేది తమ ప్రధాన లక్ష్యమని విజయవాడలో స్పష్టం చేశారు.

కేరళ తరహాలో...
కేరళ తరహాలో రాష్ట్రంలోనూ అటవీ స్టేషన్లు ఏర్పాటు చేసే అంశాన్ని అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. నాలుగైదు బీట్లు, రెండు మూడు సెక్షన్లను కలిపి ఒక అటవీ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని- ఇవి అడవుల పరిరక్షణలో కీలకంగా ఉంటాయని ప్రతీప్ కుమార్ చెప్పారు.

కేంద్రానికి లేఖ...
తమ వద్దనిల్వ ఉన్న 5 వేల మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనం అమ్మకానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు. ఈ నెల నాలుగో తేదీన తిరుపతిలో ఎర్రచందనం నిల్వలు, ఇతర అంశాలపై తిరుపతిలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వన్యప్రాణులను కాపాడటం, అభయారణ్యాల పరిరక్షణ, సామాజిక అడవుల పెంపకంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములు చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి వెల్లడించారు.

ఇవీ చూడండి-ఇక ప్రతి జనవరిలో ఉద్యోగాల జాతర: సీఎం

Intro:AP_TPG_15_01_EX_MLA_PRESSMEET_AB_AP10092
(. ) గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మూడు నెలల్లోనే రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా చేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరెంటు కోతలు రాష్ట్రంగా తయారు చేశారని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు.

Body:తణుకు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన పి పి ఏ ఒప్పందాలను రద్దు చేయడంతోపాటు చేయడంతోపాటు వారికి చెల్లింపులు చేయకపోవడంతో కరెంటు కోతల పెరిగాయన్నారు. బొగ్గు అందుబాటులో ఉన్న ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గిపోయిందని చెప్పారు.

Conclusion:అమరావతి నిర్మాణ పనులు, పోలవరం ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయని చెప్పారు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగుల ఎంపికలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నారు వైసిపి కార్యకర్తలు ఉద్యోగులుగా వచ్చారని తెలిపారు. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తానని అధికారంలోకి వచ్చిన వ్యక్తి మూడు నెలల్లోనే ఈ పరిస్థితికి చేరుకున్నారని రాధాకృష్ణ అన్నారు విలేకర్ల సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్లు తోట సూర్యనారాయణ బసవా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బైట్: ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.