ETV Bharat / city

సొంత నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు.. అదును చూసి ఆక్రమిస్తున్నారు! - బందర్‌రోడ్డులో సాగునీటి కాల్వ ఆక్రమణపై ప్రత్యేక కథనం

అధికారులు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రహదారి చెంత ఉన్న సాగునీటి కాల్వ.. రోజురోజుకూ కుచించుకుపోతోంది. రోడ్డు నిర్మాణ పనుల కోసం కాల్వ వెడల్పును తగ్గించేస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారులు... వారు కొనుగోలు చేసిన పొలాల వద్ద లేఔట్‌ అభివృద్ధికి పక్కా రోడ్డు లేని కారణంగా కాల్వను ఆక్రమించి మరీ నిర్మాణాలు చేస్తున్నారు. రైతుల ప్రయోజనం కోసం నీటి ప్రవాహం ఆగకుండా తమ సొంత డబ్బులతో కాల్వను నిర్మిస్తున్నామంటూ స్థిరాస్తి వ్యాపారులు పేర్కొంటున్నారు. ఆయకట్టు శివారు వరకు సక్రమంగా నీరు చేరకపోతే తమ పంట పొలాలు బీడువారిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.

Occupancy of irrigation canal
బందర్‌రోడ్డులో సాగునీటి కాల్వ ఆక్రమణ
author img

By

Published : Jul 29, 2021, 12:55 PM IST

బందర్‌రోడ్డులో సాగునీటి కాల్వ ఆక్రమణ

విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే బందర్‌ రోడ్డులో సాగునీటి కాల్వ.. ఆక్రమణలకు గురవుతోంది. కంకిపాడు మండలంలో సుమారు రెండున్నర వేల ఎకరాల నుంచి మూడు వేల ఎకరాల సాగు భూములకు నీరందించే పంట కాల్వ కుచించుకుపోతోంది. మచిలీపట్నం రహదారికి ఆనుకొని ఉన్న కోలవెన్ను ఛానల్‌కు సమీపంలో వెంచర్లు వేస్తోన్న స్థిరాస్తి వ్యాపారులు కాల్వ వెడల్పును తగ్గించేస్తున్నారు. 53 అడుగుల వెడల్పు ఉన్న ఈ కాల్వను 50 అడుగుల మేర కిలో మీటర్‌ పొడవున ఆక్రమించి రోడ్డు నిర్మిస్తున్నారు. గత రెండు వారాలుగా ఈ పనులు జరుగుతున్నా అధికార యంత్రాంగం ఎవరూ అటువైపుగా కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

వారి ప్రయోజనం కోసమే..

పెనమలూరు - కంకిపాడు మండలాల మధ్య విజయవాడ ప్రధాన రహదారిని అనుకొని ఈ కోలవెన్ను ఛానల్‌ ఉంది. దీని ద్వారా కంకిపాడు మండలంలోని పునాదిపాడు, ఈడుపుగల్లు, గొల్లగూడెం గ్రామాల పరిధిలోని ఆయకట్టుకు సాగు నీరందుతోంది. ఇటీవల ఈ ఛానల్‌ను ఆనుకొని స్థిరాస్తి వ్యాపారులు భూములు కొనుగోలు చేశారు. వెంచర్‌ పనులు ప్రారంభించారు. ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సరైన రోడ్డు లేకపోవడంతో ఈ ఛానల్‌ ఆక్రమణను సులువైన మార్గంగా మలచుకున్నారు. చుట్టుపక్కల రైతులకు తాము పక్కా రహదారి వేస్తున్నామంటూ వారితో సంప్రదింపులు జరిపారు.

కాల్వకు సిమెంట్‌లైనింగ్‌ చేయిస్తామని.. దానివల్ల నీరు ఏ మాత్రం ఆగకుండా ముందుకు వెళ్తుందని.. పొలాల్లోని పంట ఉత్పత్తిని మార్కెట్‌కు తరలించేందుకు అనువుగా ఉండడమే కాకుండా భూమి విలువ పెరుగుతుందంటూ కొందరు రైతులను ఒప్పించారు. తమ ప్రణాళిక ప్రకారం యంత్రాల సాయంతో రోడ్డు పనులు ప్రారంభించారు. ఇదే సమయంలో కాల్వ సిమెంట్‌లైనింగ్‌ పనులూ చకచకా చేయించేస్తున్నారు. రైతుల ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఈటీవీ భారత్​ బృందాన్ని- స్థిరాస్తి సంస్థ ప్రతినిధులు నిలువరించారు. తాము చేస్తోన్న ఈ పని పూర్తిగా రైతుల లబ్ధి కోసమేనని తెలిపారు. కోటి రూపాయల వరకు ఖర్చు చేసి ఈ పనులు జరుపుతున్నామని తెలిపారు.

సాగు నీరు సమయానికి అందేనా?

ఈ కాల్వపై కాంక్రీట్‌ పనులు చేపట్టేందుకు వీలుగా పలు చోట్ల అడ్డు కట్టలు వేశారు. వరినాట్లు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో కోలవెన్ను ఛానల్‌పై కాంక్రీట్‌ పనులు ముమ్మరం చేసి, సాగునీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తున్నారంటూ కంకిపాడు మండలంలోని పునాదిపాడు, ఈడుపుగల్లు, గొల్లగూడెం గ్రామాల పరిధిలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. జూలై నెలాఖరు వస్తున్నా- తగినంత పరిమాణంలో సాగుకు నీరు లేకపోతోందని.. శివారు ప్రాంత రైతులు పంటలు వేయాలా వద్దా అని యోచిస్తున్నారు.

కానరాని అధికారుల జాడ..

కోలవెన్ను ఛానల్‌ ఆక్రమణల గురించి అడిగేందుకు కాల్వ వద్దకు వస్తే ఇరిగేషన్‌ అధికారులు, సిబ్బంది అందుబాటులో లేరని.. తమకు ఏం చేయాలో తెలియడం లేదని రైతులు వాపోతున్నారు.

ఇదీ చదవండి:

SRISAILAM: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. 10 గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.