ETV Bharat / city

friendship day: 'వేల మంది స్నేహమే చోదకశక్తి.. సేవలోనే సంతృప్తి' - వేల మంది స్నేహమే చోదకశక్తి

చెడు స్నేహం జీవితాన్ని నాశనం చేస్తే.. మంచి స్నేహం జీవితాల్లో వెలుగు నింపుతుందనే మాటకు ' హెల్పింగ్‌ హ్యాండ్స్‌' సభ్యులు ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితం ఏర్పడిన ఈ స్వచ్ఛంద సంస్థకు స్నేహమే చోదకశక్తి. సామాజిక మాధ్యమాల్లో ఏర్పడిన పరిచయాలే సమాజంలో మార్పుదిశగా అడుగులు వేయొచ్చని నిరూపించాయి. నేడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా 'హెల్పింగ్ హ్యాండ్' సభ్యుల సేవలపై ప్రత్యేక కథనం.

helping-hands-foundation
హెల్పింగ్‌ హ్యాండ్స్‌ స్వచ్ఛంద సంస్థ
author img

By

Published : Aug 1, 2021, 8:02 AM IST

కోట్లు సంపాదించినా రాని సంతృప్తి సేవ చేస్తే వస్తోంది

స్నేహబంధమనే ఆయుధంతో ఎంతో మంది హృదయాలను గెల్చుకున్న హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సంస్థకు స్నేహమే చోదకశక్తిగా మారింది. విజయనగరంలో ఏర్పడిన ఈ సంస్థ... రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ సేవలందించే దిశగా అడుగులు వేస్తోంది. 9 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ సంస్థలో ఇప్పుడు కొన్ని వేల మంది స్నేహితులు ఉన్నారు. ప్రత్యక్షంగానేగాక ఆన్‌లైన్‌ వేదికల్లోనూ తమ సంస్థకు స్నేహితులు ఉన్నారని..తెరవెనుకనే ఉండి ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపేందుకు సాయం చేస్తున్నారని... హెల్పింగ్‌ హ్యాండ్స్‌ వ్యవస్థాపకుడు వెంకీ తెలిపారు. ఎక్కడైనా అనాథలు ఉన్నారన్నా... అనారోగ్య సమస్యలతో జీవితం దుర్భరంగా మారినవాళ్ల గురించి సమాచారం తెలిసినా... ఈ సేవాసంస్థ సభ్యులు అక్కడ వాలిపోతారు. తమ ఇంట్లోని సభ్యులే కష్టాల్లో ఉన్నట్లుగా భావించి అన్ని కార్యకలాపాలు దగ్గరుండి చేస్తున్నారు. స్నేహితుల సహకారంతోనే ఇవన్నీ చేయగలుగుతున్నామని వెంకీ చెబుతున్నారు.

స్వచ్ఛమైన సేవలోనే సంతృప్తి..
తొలుత వెంకీ తమకు ఓ కుటుంబసభ్యునిగా పరిచయమని... తను చేస్తున్న సేవా కార్యక్రమాలు చూశాక ఆప్తమిత్రుడిగా మారాడని స్నేహితులు కొనియాడారు. కోట్లు సంపాదించినా రాని సంతృప్తి, స్వచ్ఛమైన సేవలో లభిస్తోందని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఎంతోమంది స్నేహితులు తమతో ప్రత్యక్షంగా ఎప్పుడూ కలువలేదని... తమ చేస్తున్న సేవల్లో నిజాయితీ ఉందని గ్రహించే ఏ సాయమడిగినా అందిస్తున్నారని వెల్లడించారు. ఆ స్నేహితులంతా సంతోషంగా ఉంటే ఎంతో మందిని కష్టాల నుంచి గట్టెక్కించగలమని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మరింతమందితో హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సభ్యుల స్నేహబంధం ఏర్పడి.. మరెంతోమందికి సాయం అందేందుకు దోహదపడాలని పలువురు కాంక్షించారు.

ఇదీ చదవండి..Cabinet: ఆగస్టు 6న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.