బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నిలువరించాలని సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జోనల్ అధ్యక్షులు కె. వేణుగోపాల రావు డిమాండ్ చేశారు. ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నిలిపివేయాలని అన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేణుగోపాల రావు మాట్లాడారు. ఎల్ఐసీ జాతీయీకరణ చట్టాన్ని సవరిస్తామని బడ్జెట్లో పేర్కొన్నట్లు గుర్తు చేశారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74% మేరకు పెంచాలని పొందుపరిచారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ నిర్ణయాల పట్ల సాత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుందన్నారు.
ఎల్ఐసీని ప్రభుత్వరంగ సంస్థగా కాపాడుకునేందుకు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్.. ఉద్యమ కార్యాచరణను ఏర్పాటు చేసినట్లు వేణుగోపాల రావు చెప్పారు. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 300 మంది పార్లమెంట్ సభ్యులను.. రిప్రజెంట్ చేశామన్నారు. ఎల్ఐసీ ప్రభుత్వరంగ సంస్థగా కొనసాగాలని పలు రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయని అన్నారు. అలాగే స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ ప్రక్రియను వ్యతిరేకించేందుకు హామీ ఇచ్చాయని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన ఎల్ఐసీని పరిరక్షించుకునేందుకు జరుగుతున్న ఉద్యమాల్లో ప్రజలు భాగస్వాములు కావలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: