దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చట్టవిరుద్ధ విక్రయాలను అరికట్టడానికి నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో 492 మంది అనధికారిక విక్రేతలు పట్టుబడ్డారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో అనధికారికంగా విక్రయాలు నిర్వహిస్తున్న వ్యాపారులను అరికట్టడానికి నిరంతరం ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని దక్షిణ మధ్య రైల్వే జోన్ తెలిపింది.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గజానన్ మాల్య, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ శ్రీ జీ జాన్ ప్రసాద్ ఆదేశానుసారం కమర్షియల్ విభాగం అధికారులు/ఇన్స్పెక్టర్లు, టికెట్ తనిఖీ సిబ్బంది, రైల్వే రక్షక దళ సిబ్బంది మొదలగు వారు ఈ ప్రత్యేక తనిఖీలలో పాల్గొన్నారు.
రైల్వే పరిసరాలలో తినుబండారాలు, పానీయాల అనధికారిక విక్రయాలను అరికట్టడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రతి నెల ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా, జోన్ పరిధిలో 2021 అక్టోబర్‌లో 543 తనిఖీలు చేశారు. ఇందులో 492 మంది అనధికారిక అమ్మకందారులు పట్టుబడ్డారు. రూ.4,78,640 జరిమానాగా వసూలు చేశారు. జరిమానా చెల్లించని అమ్మకందారులను విచారణ నిమిత్తం రైల్వే రక్షక దళ సిబ్బందికి అప్పజెప్పారు. జోన్ పరిధిలోని మొత్తం ఆరు డివిజన్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
ఇందులో..
- సికింద్రాబాద్ డివిజన్‌లో 108 మంది అనధికారిక అమ్మకందారులు పట్టుబడగా, రూ.74,100 జరిమానాగా వసూలు చేశారు.
- విజయవాడ డివిజన్‌లో 129 మంది అనధికారిక అమ్మకందారులు పట్టుబడగా, రూ. 2,06,650 జరిమానాగా వసూలు చేశారు.
- గుంతకల్ డివిజన్‌లో 163 మంది అనధికారిక అమ్మకందారులు పట్టుబడగా, రూ. 1,31,210 జరిమానాగా వసూలు చేశారు.
- హైదరాబాద్ డివిజన్‌లో 38 మంది అనధికారిక అమ్మకందారులు పట్టుబడగా, రూ.36,280 జరిమానాగా వసూలు చేశారు.
- గుంటూరు డివిజన్‌లో 44 మంది అనధికారిక అమ్మకందారులు పట్టుబడగా, రూ. 22,900 జరిమానాగా వసూలు చేశారు.
- నాందేడ్ డివిజన్‌లో 10 మంది అనధికారిక అమ్మకందారులు పట్టుబడగా, రూ.7,500 జరిమానాగా వసూలు చేశారు.
జోన్ పరిధిలో అనధికారిక అమ్మకాందారులను నిరోధించడానికి దక్షిణ మధ్య రైల్వే బృందం చేస్తున్న కృషిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గజానన్ మాల్య ప్రత్యేకంగా అభినందించారు. అనధికారిక కార్యకలాపాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. రైళ్లలో, రైల్వే స్టేషన్ పరిసరాలలో అనధికారిక అమ్మకందారులను, అపరిశుభ్రత ఆహార పదార్థాలను అరికట్టడానికి ఇటువంటి ప్రత్యేక తనిఖీలు దోహదపడుతాయని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: హెలికాఫ్టర్తో వాయుసేన రెస్క్యూ ఆపరేషన్.. 11మంది సేఫ్