ETV Bharat / city

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే - Announcement of special trains for South Central Railway Sankranthi

సంక్రాంతి పురస్కరించుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-నర్సాపూర్, కాచిగూడ-చిత్తూర్, సికింద్రాబాద్-కాకినాడ నడిపిస్తున్నట్లు తెలిపింది. తేదీల వారిగా వివరాలు వెల్లడించింది.

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే

author img

By

Published : Dec 29, 2020, 10:50 PM IST

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-నర్సాపూర్, కాచిగూడ-చిత్తూర్, సికింద్రాబాద్-కాకినాడకు ప్రత్యేకంగా నడుపుతున్నట్లు వెల్లడించింది.

బరౌని నుంచి ఎర్నాకులం, దర్బంగా-మైసూర్, పాటలీపుత్ర-యశ్వంత్​పూర్, గయా-చెన్నై సెంట్రల్​కు సైతం ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నామని రైల్వే సీపీఆర్వో రాకేష్ పేర్కొన్నారు.

హైదరాబాద్-తాంబరం, తిరుపతి-లింగంపల్లి, కాకినాడ పోర్ట్-లింగంపల్లి, నర్సాపూర్-లింగంపల్లి, హైదరాబాద్-తిరువనంతపురం, సికింద్రాబాద్-సిర్​పూర్ కాగజ్​నగర్, కాచిగూడ-మైసూర్, విజయవాడ-హుబ్లీ, హైదరాబాద్- ఔరంగాబాద్, హెచ్.ఎస్.నాందేడ్-పన్వేల్, సికింద్రాబాద్-రాజ్​కోట్, తిరుపతి-అమరావతికి జనవరి20 నుంచి మార్చి31 వరకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామన్నామని ద.మ.రైల్వే పేర్కొంది.

వివరాలు..

సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్ జనవరి 10, 11, 14, 15 తేదీల్లో నడిపిస్తారు. నర్సాపూర్-సికింద్రాబాద్ జనవరి 11, 12, 15, 16. కాచిగూడ-చిత్తూర్ జనవరి 8, 9, 10, 11, 12, 16. చిత్తూర్-కాచిగూడ జనవరి 9-15. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ జనవరి 8-19. కాకినాడ టౌన్-సికింద్రాబాద్ జనవరి 17-20 తేదీల్లో నడిపించనున్నట్లు ద.మ.రైల్వే వెల్లడించింది.

ఇదీ చూడండి: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.