ETV Bharat / city

ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై రూట్​ మ్యాప్​ ప్రకటించాలి - సోము వీర్రాజు

Somu Letter To CM: ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఒక రూట్‌మ్యాప్‌ ప్రకటించాలని ముఖ్యమంత్రికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగలేఖ రాశారు. వంశధార, నాగావళి నదుల అనుసంధానం ఎందుకు చేయడం లేదని.. నేరడి బ్యారేజీ, గొట్టా బ్యారేజీ, మహేంద్రతనయపై ఆఫ్‌షోర్‌ రిజర్వాయరు, మేఘాద్రిగడ్డ వంటి వాటి విషయంలో ముఖ్యమంత్రి వైఖరి ఏంటో స్పష్టం చేయాలని బహిరంగ లేఖ ద్వారా వీర్రాజు డిమాండ్‌ చేశారు.

Somu Letter To CM
ముఖ్యమంత్రికి సోము వీర్రాజు బహిరంగలేఖ
author img

By

Published : Apr 13, 2022, 8:47 PM IST

Somu Letter To CM: ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగలేఖ రాశారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీల వీడియోని తన లేఖకు జతచేశారు. ఉత్తరాంధ్రలో ఎటుచూసినా నిర్మాణం పూర్తి కాని మొండిగోడలు, చుక్కనీరు లేని కాల్వల వ్యవస్థ, ప్రాజెక్టు ప్రధాన కాల్వల వద్ద గ్రోయిన్స్‌ నిర్మాణం కాకపోవడంతో సాగునీటి కోసం ఆ ప్రాంత రైతులు ఎదురుచూపులు చూస్తున్నారన్నారు. సాగునీరు లేక మంచి మాగాణీ భూములు సైతం ఎడారిని తలపిస్తున్నాయని అన్నారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఒక రూట్‌మ్యాప్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్ర విస్తీర్ణంలో నాలుగో వంతు ఉంటుందని, అంతటి విస్తీర్ణం కలిగిన ప్రాంతంలో నీటిపారుదల పథకాలు పూర్తి చేయకపోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల విషయంలో అధికారుల మంద వైఖరా? ప్రభుత్వ శకుని వైఖరా కారణమనేది అర్ధం కావడం లేదని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగితే పునరావాస ప్యాకేజీలు అమలు చేయరని.. కాల్వల నిర్మాణం జరగదని.. కాల్వలు ఉంటే గ్రోయిన్స్‌ లేవని ఈ విధంగా ప్రతి ప్రాజెక్టు ఏదో ఒక దశలో అపరిష్కృతంగా ఉంచారన్నారు.

వంశధార ప్రాజెక్టు 19 టీఎంసీల ప్రాజెక్టు అయితే ప్రస్తుతం తొమ్మిది టీఎంసీల సామర్ధ్యం మాత్రమే ఉందని సుమారు 45 కోట్ల రూపాయలు వ్యయం చేస్తే పూర్తిగా అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చని తెలిపారు. ఉత్తరాంధ్రలో 50 సంవత్సరాల క్రితం మూడు ప్రాజెక్టులకు ప్రణాళికలు రూపొందిస్తే నేటికీ ఆ ప్రాజెక్టులు కేవలం ఎన్నికల సమయంలో అజెండాగా మారుతున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి కాకముందు ఉత్తరాంధ్ర ప్రజలకు హామీ ఇచ్చి ఇంతవరకు ఉత్తరాంధ్ర వైపు ఎందుకు ముఖం చూపడం లేదని ప్రశ్నించారు. వంశధార, నాగావళి నదుల అనుసంధానం ఎందుకు చేయడం లేదని.. నేరడి బ్యారేజీ, గొట్టా బ్యారేజీ, మహేంద్రతనయపై ఆఫ్‌షోర్‌ రిజర్వాయరు, మేఘాద్రిగడ్డ వంటి వాటి విషయంలో ముఖ్యమంత్రి వైఖరి ఏంటో స్పష్టం చేయాలని బహిరంగ లేఖ ద్వారా వీర్రాజు డిమాండ్‌ చేశారు.

Somu Letter To CM
ముఖ్యమంత్రికి సోము వీర్రాజు బహిరంగలేఖ

ఇదీ చదవండి: తూచ్.. అంతా వట్టిదే.. బాధేం లేదు: మాజీ హోం మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.