రాముడు పుట్టిన అయోధ్యలో గుడి కట్టుకోవాలన్న కోట్ల మంది రామభక్తుల అభిలాష నెరవేరడం ఒక అద్భుత అనుభూతి అని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. ఈ ఆగస్టు 5 దేశచరిత్రలో చిరస్మరణీయమైన రోజన్నారు. మనం కొలిచే దేవుడికి ఆలయం నిర్మించుకోవడానికి దశాబ్దాల పోరాటం చేయాల్సిరావడం మన సెక్యులర్ భావ పునాదుల పటిష్టతకు రుజువని స్పష్టం చేశారు. ఆలస్యంగా అయినా అభిలాష నెరవేరడం ప్రతి రామభక్తుడికి పరమానందకరమని వెల్లడించారు.
ఇదీ చదవండి: అయోధ్య వివాదం ఆరంభం నుంచి భూమిపూజ వరకు..