Somireddy Chandramohan reddy: నెల్లూరు జిల్లాలో విదేశీ మహిళపై అత్యాచారానికి యత్నించింది.. వైకాపా కార్యకర్తలేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో రౌడీయిజం పేట్రేగిపోతోందని ఆయన ధ్వజమెత్తారు. దాడులు ఎదుర్కొని ఫిర్యాదు చేసేందుకు వెళ్లే బాధితుల్ని నిందితులుగా మారుస్తున్నారని ఆరోపించారు. దోషులు ఫిర్యాదు దారులుగా మారుతున్నారన్నా సోమిరెడ్డి.. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఇకనైనా ఫుల్స్టాప్ పెట్టి, పరిపాలన చేయాలని హితవు పలికారు.
Somireddy Chandramohan reddy: మూడేళ్ల తర్వాతైనా వ్యవసాయ, జలవనరులు, ఆర్ అండ్ బీ శాఖలను తెరవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో ఎన్నో శాఖలు మూతపడ్డాయని విమర్శించారు. ఏపీ కంటే బీహార్ పోలీసులు మెరుగనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు విజయవాడలో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఇదీ చదవండి: Rape attempt: నెల్లూరులో దారుణం.. విదేశీ మహిళపై అత్యాచారయత్నం