ఎస్ఈసీ విషయంలో జగన్ ప్రభుత్వం అనేకసార్లు హైకోర్టు, సుప్రీంకోర్టుల మెట్లెక్కి వారి తీర్పులను ధిక్కరించినా చివరకు తలవంచక తప్పలేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకం విషయంలో ప్రభుత్వం తప్పు చేస్తోందని సామాన్య ప్రజలూ అభిప్రాయం వ్యక్తం చేసినా.. వైకాపా ప్రభుత్వం లెక్కచేయలేదని మండిపడ్డారు.
సీఎం జగన్ పెట్టుకున్న సలహాదారులెవరోకానీ వారికి కనీస జ్ఞానం కరవైనట్టుందని విమర్శించారు. న్యాయస్థానాలతో మొట్టికాయలు తినటంతో పాటు వితండవాది అని దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు. చివరకు రమేశ్ కుమార్ను అదే స్థానంలో కూర్చోబెట్టక తప్పలేదన్నారు. ఇప్పటికైనా రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాలని హితవుపలికారు.